epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఓటమికి ఆ ఒక్క తప్పే కారణం: దక్షిణాఫ్రికా

కలం డెస్క్: భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. 74 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని సఫారీల కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పాడు. కటక్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సమష్టిగా రాణించగా, ఆఫ్రికా జట్టు 176 పరుగుల లక్ష్య ఛేదనలో 74 పరుగులకే కుప్పకూలి 101 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన మార్క్‌రమ్ (Aiden Markram), బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా బ్యాటింగ్ పూర్తి స్థాయిలో విఫలమైందని పేర్కొన్నాడు. “మేం మ్యాచ్‌ను మంచి పాజిటివ్ నోట్లో ప్రారంభించాం. బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ మెరుగైన ప్రదర్శన చేశాం. ఆరంభంలో మా ప్రణాళికలు అద్భుతంగా అమలయ్యాయి. అందుకే మొత్తం మ్యాచ్‌లో ఓడిపోయినా మా ప్రదర్శన పట్ల కొంత గర్వపడవచ్చు,” అని మార్క్‌రమ్ అన్నారు.

అయితే బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం తమను పూర్తిగా కుంగదీసిందని ఆయన స్పష్టం చేశాడు. “ఈ రోజుల్లో టీ20 క్రికెట్‌లో పరిస్థితులను అందిపుచ్చుకోవడానికి ఎక్కువ సమయం దొరకదు. భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం, వరుసగా వికెట్లు కోల్పోవడం, మూమెంటమ్‌ను మా వైపుకు తిప్పుకోలేకపోవడం ఇలా అన్ని కలిసి మా ఓటమిని శాసించాయి,” అని పేర్కొన్నాడు.

తమ తప్పిదాలపై చర్చించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వాటిపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకూడదని మార్క్‌రమ్ సూచించాడు. “ఈ మ్యాచ్‌ని త్వరగా మర్చిపోవాలి. ఈ ఫార్మాట్‌లో ఉన్న సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలి. సిరీస్ ఇంకా మిగిలింది, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలి,” అని దక్షిణాఫ్రికా (South Africa) కెప్టెన్ చెప్పాడు.

Read Also: టీ20 గెలుపుకు అతడే కారణం: సూర్యకుమార్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>