Mobile Popup Ad
Mobile Popup Ad

దంచికొడుతున్న దక్షిణాఫ్రికా.. చెమట చిందిస్తున్న భారత బౌలర్లు

IND vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లకు తిప్పలు తప్పడం లేదు. సఫారీ బ్యాటర్లను అడ్డుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీ స్కోర్ టార్గెట్‌గా చెలరేగుతున్నారు. 247/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. రెండో రోజుగా కూడా అద్భుతంగా రాణిస్తోంది. వారి వికెట్లు తీయడం కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముత్తుసామి 40నాటౌట్, కై్ వేరియన్ 21 నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 95 బంతుల్లో 37 పరుగులను జోడించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్ 9 ఓవర్లలో 283/6గా ఉంది. వారి వికెట్లు పడగొట్టడం భారత బౌలర్లకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. వికెట్ కోసం అన్ని వ్యూహాలు వేస్తున్నా.. ఏదీ కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.

IND vs SA | దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ 112 బంతుల్లో 49 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ టెంబా బవుమా 92 బంతుల్లో 41 పరుగులతో రాణించాడు. ఐడెన్‌ మార్‌క్రమ్‌ 38, ర్యాన్‌ రికెల్టన్‌ 35, టోనీ డి జోర్జి 28 పరుగులతో పర్వాలేదు అనిపించారు.

Read Also: మహిళల కోసం FIFAలో స్పెషల్ ఎడిషన్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>