epaper
Monday, March 2, 2026
epaper

మహిళల కోసం FIFAలో స్పెషల్ ఎడిషన్

ఫ్యాన్స్‌కు ఫిఫా(FIFA) గుడ్ న్యూస్ చెప్పింది. 2026లో జరిగే ఫిఫా సిరీస్‌తో మహిళ ఎడిషన్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఫిఫా హిస్టరీలో మహిళా ఫుట్‌బాలర్స్ ఎడిషన్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఈసారి పురుషుల టోర్నీతో పాటు మహిళల ఫిఫా సిరీస్‌ను నిర్వహించనున్నట్లు చెప్పింది. ఇతర ఖండాల ఫుట్‌బాల్ టీమ్స్‌తో అరుదుగా మ్యాచ్‌లు ఆడే జట్లకు మరిన్న అవకాశాలు ల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫిఫా గ్లోబల్ గేమ్ స్ట్రాటెజిక్ ఆబ్జెక్టివ్స్ 2023–2027 ఈ ప్రణాళికను రూపొందించింది.

ఈ సందర్భంగా ఫిఫా(FIFA) అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో మాట్లాడుతూ.. ఫిఫా సిరీస్‌ ప్రధాన ఉద్దేశం ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమని అన్నారు. అర్థవంతమైన అంతర్జాతీయ మ్యాచ్‌ల ద్వారా ఫుట్‌బాల్ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఫిఫా లక్ష్యమని చెప్పుకొచ్చారు. 2026 ఎడిషన్‌ ద్వారా పురుషులతో పాటు మహిళల ఫుట్‌బాల్‌కు కూడా మరిన్ని అవకాశాలు లభించనున్నాయని అన్నారు.

Read Also: యుద్ధం ఎక్కడయినా గెలిచేది భారత్‌యే: లెఫ్టినెంట్ జనరల్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!