కలం, వెబ్ డెస్క్: ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎమర్జెన్సీ విధించడమనేది రాజ్యాంగబద్ధంగానే జరిగింది. అయితే ప్రజల ప్రజాస్వామ్య హక్కులు మాత్రం ఇబ్బందుల్లో పడ్డాయి. ఇందిరా గాంధీ ఏ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందో ఆమె కోణంలో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలను సద్దుమణిగేలా చేయడంతో పాటు అంతర్గత పరిస్థితులను వేగంగా చక్కదిద్దడానికే ప్రధానిగా ఇందిరా గాంధీ ఆ నిర్ణయం తీసుకున్నారు. తరువాత కాలంలో దీనిపై ఇందిరా గాంధీ పశ్చాత్తాపం చెందారు. దేశ ప్రజలకు బేషరతుగా తన క్షమాపణలు కూడా చెప్పారు” అని గుర్తు చేశారు.
సంజయ్ గాంధీ కారణం కాదు..
ఎమర్జెన్సీ విధించాలన్న ఆలోచన ఆమె కుమారుడు సంజయ్ గాంధీదే అని, రాజీవ్ గాంధీ మాటలను ఆమె పట్టించుకోలేదన్న ఆరోపణలను సోనియా గాంధీ కొట్టిపారేశారు. “ఎమర్జెన్సీకి కారణం సంజయ్ గాంధీనే అన్న అపవాదు బయట ప్రచారంలో ఉంది. అది నిజం కాదు. వాస్తవానికి ఇందిరా గాంధీపై ఆమె మంత్రుల నుంచే తీవ్ర ఒత్తిడి ఉండేది. ఎమర్జెన్సీపై రాజీవ్ ఆలోచనలు మరోలా ఉండేవి. అలా ఆలోచించినవారు కూడా ఆ సమయంలో చాలా తక్కువే. తరువాత కాలంలో ఇందిరా గాంధీ వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి. అందుకనుగుణంగానే ఆమె అనేక నిర్ణయాలు తీసుకున్నారు” అని సోనియా గాంధీ (Sonia Gandhi) వివరించారు. సోనియా గాంధీ ఆటోబయోగ్రఫీ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం విడుదల కాబోతున్న నేపథ్యంలో సోనియా గాంధీ ఇంతవరకు బయటకు చెప్పని ఎన్నో విషయాలను వివరించారు.
Also Read : న్యూజిలాండ్ పై కోహ్లీ చరిత్ర.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు!
Follow Us On : WhatsApp

