టీజీ సేఫ్ తనిఖీలు.. కేఎఫ్‌సీ లైసెన్స్ ర‌ద్దు!

క‌లం, వెబ్‌డెస్క్‌: క‌ల్తీ ఫుడ్ పై టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు కొర‌ఢా ఝులిపిస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఐదు సంస్థ‌ల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులు ర‌ద్దు చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు నేడు వెల్ల‌డించారు. క‌రీంన‌గ‌ర్‌లోని స‌వ‌ర‌న్ స్ట్రీట్‌లో ఉన్న కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్ లైసెన్స్‌ను ర‌ద్దు చేశారు. ఇక్క‌డ సుమారు 90 లీట‌ర్ల క‌ల్తీ నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిచెన్ లో ఈగలు, దుర్వాసన, అపరిశుభ్రమైన ఫ్రీజర్లు ఉన్నట్లు గుర్తించారు.

పటాన్‌చెరువులోని ముత్తంగి గ్రామంలో ఉన్న పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. బొద్దింకలు, మూసుకుపోయిన డ్రైనేజీలు, వండిన మాంసం, పచ్చి మాంసాన్ని కలిపి నిల్వ చేయడం, పరిశుభ్రత రికార్డులు లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలోని గణపతి హోటల్ మెస్ అండ్ హాస్టల్‌లో చట్నీ, రైస్ బాక్సుల్లో బొద్దింకలు, కూరగాయలు, ఆహార పదార్థాలపై ఎలుకల వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు, పప్పులో ఫంగస్ ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. వీటితో పాటు మదన్నపేటలోని ధోబీ ఘాట్ వద్ద ఉన్న నవాబీ డిలైట్స్‌లో ఫ్రిజ్‌లో పురుగుల తిరుగుతున్న‌ట్లు గుర్తించారు.

అపరిశుభ్రంగా ఉండ‌టంతో పాటు సిబ్బంది గ్లౌజులు వాడ‌టం లేద‌ని గుర్తించారు. మెహదీపట్నంలోని అయోధ్య నగర్ కాలనీలో ఉన్న ఎస్‌కే బేకర్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్‌లో డేట్ అయిపోయిన ఫుడ్‌, చెత్త బుట్ట పక్కన మూతలేని అన్నం, పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్, ఈగలు, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఐదు సంస్థల ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు టీజీ సేఫ్ వెల్లడించింది.

Also Read : ఎమర్జెన్సీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>