న్యూజిలాండ్ ‌పై కోహ్లీ చరిత్ర.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు!

కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లోని సెలొ బేసిన్ రిజర్వ్‌లో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆయన కొత్త చరిత్ర సృష్టించారు. మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెరో 1,971 పరుగులతో సమానంగా ఉన్నారు.

అయితే భారత్ 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వేళ, కోహ్లీ తాను ఎదుర్కొన్న రెండో బంతికే ఫోర్ కొట్టి పాంటింగ్ రికార్డును దాటేశారు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ 51 మ్యాచ్‌ల్లోని 50 ఇన్నింగ్స్‌ల్లో 45.83 సగటుతో 6 సెంచరీలు, 12 అర్ధసెంచరీల సాయంతో 1,971 పరుగులు చేశారు.

కాగా, విరాట్ కోహ్లీ కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్కును దాటి 1,978 పరుగులతో అగ్రస్థానానికి చేరారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆర్సీబీ సహచర బౌలర్ జాకబ్ డఫీ వేసిన బంతిని షాట్ ఆడబోయి కవర్ పాయింట్‌లో క్యాచ్ ఇచ్చి 7 పరుగులకే అవుటయ్యారు. సిరీస్‌లో ఇంకా మూడు వన్డేలు మిగిలి ఉన్నందున, వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచే అవకాశం కోహ్లీకి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>