కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీసు శాఖలో సుదీర్ఘంగా సేవలు అందించి రిటైర్ అయిన నాలుగు రోజులకే క్రితం ఏఎస్సై గంగాధర్ గౌడ్ (ASI Gangadhar Goud) గుండెపోటు సంభవించింది. సడన్ హార్ట్ ఎటాక్ తో ఆయన మృతి చెందారు. నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్-1కి చెందిన కె.గంగాధర్ గౌడ్ స్పెషల్ బ్రాంచ్ లో ఏఎస్సైగా పనిచేశారు.
ఆగస్టు 31నే పదవీ విరమణ చేశారు. కాగా.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. పోలీసు శాఖకు ఈ సంఘటన షాక్ కు గురి చేసింది.. ఆయన మృతదేహానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ నివాళులర్పించారు. పలువురు పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు.

