టోర్నీలో తేడా వస్తే సస్పెన్షన్.. టీమిండియా కొత్త నియమావళి!

కలం, స్పోర్ట్స్ : జపాన్‌లోని ఐచి-నాగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు (Asian Games) ప్రారంభం కానున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం భారత బృందం తమ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈసారి భారత జట్టులో మొత్తం 768 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 503 మంది క్రీడాకారులు కాగా, 246 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. క్రీడాకారుల మానసిక ఒత్తిడిని తగ్గించి, సరైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, సానుభూతితో ఉండటం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తున్నారు.

ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. చేయకూడని పనుల జాబితాను ఒకటి రెండు రోజుల్లో అందరికీ అందించనున్నారు. తొలిసారిగా జట్టుతో పాటు సేఫ్‌గార్డింగ్ ఆఫీసర్ నీతల్ నారంగ్ ప్రయాణిస్తున్నారు. ఎవరూ నిర్లక్ష్యానికి గురికాకుండా చూడటమే తన ప్రధాన బాధ్యత అని ఆమె తెలిపారు. క్రీడాకారుల్లో అవగాహన పెంచేందుకు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నీతల్ చెప్పారు. జట్టుగా వెళ్లినప్పుడు అందరి సంక్షేమం ముఖ్యమని గుర్తుచేశారు.

బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, ఫిర్యాదుల కోసం ప్రత్యేక హాట్‌లైన్, ఈమెయిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ వివరాలన్నీ అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సూచనల మేరకు ఈ సేఫ్‌గార్డింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రవర్తనా నియమాలను ఉల్లంఘిస్తే అక్రెడిటేషన్ రద్దు చేసే ప్రమాదం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>