Mobile Popup Ad
Mobile Popup Ad

సోన‌మ్ వాంగ్ చుక్ నిర్భందం ర‌ద్దు

క‌లం, వెబ్ డెస్క్‌: ల‌డ‌ఖ్‌ (Ladakh)లో రాష్ట్ర హోదా కోసం జరిగిన ఉద్యమంలో హింసాత్మ‌క నిర‌స‌న‌ల‌కు కార‌ణ‌మ‌య్యార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన‌ సోన‌మ్ వాంగ్ చుక్‌ (Sonam Wangchuk)ను విడుద‌ల చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 170 రోజుల జైలు శిక్ష‌ అనంత‌రం ఆయ‌న‌పై విధించిన నిర్భందాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌ల్పిస్తున్నార‌ని పేర్కొంటూ నేష‌న‌ల్ సెక్యూరిటీ యాక్ట్ కింద‌ సోన‌మ్ వాంగ్ చుక్‌ను ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకుంది.

లడఖ్‌లో సామాజిక శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా సోనం వాంగ్ చుక్‌పై విధించిన నిర్బంధాన్ని రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా స్వాగతించారు. ఈ నిర్ణయం లడఖ్‌లో మ‌రింత న‌మ్మ‌కాన్ని పెంచేందుకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. లడఖ్‌లో ఆందోళనలు, హింసకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలు, సమస్యలకు సంబంధించిన అన్ని అంశాలను వివిధ వర్గాల ప్రతినిధులు, సమాజ నాయకులు, పౌరులతో చర్చల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>