Mobile Popup Ad
Mobile Popup Ad

జీతం ఇవ్వలేదని లారీని ఎత్తుకెళ్లిన డ్రైవర్!

కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu)లో ఓ లారీ డ్రైవర్ (Lorry Driver) ఉదంతం సంచలనం రేపింది. య‌జ‌మాని జీతం ఇవ్వ‌లేద‌ని డ్రైవ‌ర్ ఎవ‌రూ ఊహించ‌ని ప‌ని చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. గోవిందరావుపేటకు చెందిన వ్యక్తి భూపాలపల్లికి చెందిన లారీ య‌జ‌మాని వ‌ద్ద డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి య‌జ‌మాని జీతం ఇవ్వ‌డం లేద‌ని డ్రైవ‌ర్ గొడ‌వ‌ప‌డుతున్నాడు. చివ‌రికి చేసేదేం లేక‌ డ్రైవర్ లారీని తీసుకొని పరారయ్యాడు. జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసిన ఓనర్ ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా కేంద్రంలోకి వచ్చిన లారీని ఆపే క్రమంలో పోలీసులతో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. పోలీసులు డ్రైవ‌ర్‌, య‌జ‌మానితో చ‌ర్చిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: పోచారంలో ‘రాంబాయి’ సీన్ రిపీట్‌.. యువ‌తికి హెచ్ఐవీ ఇంజెక్ష‌న్‌!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>