Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డిలో సీపీఎం నాయకులు వినూత్న నిరసన

క‌లం మెద‌క్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సంగారెడ్డి (Sangareddy) న్యూ బస్టాండ్ వద్ద సీపీఎం నాయకులు తాళ్ళతో ఆటో లాగి నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించలేదని ఆరోపించారు. ప్రస్తుతం చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని ఏకంగా లీటర్ పై రూ.3 పెంచడం దుర్మార్గమన్నారు.

పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం (CPM) జిల్లా వర్గ సభ్యులు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నాయకులు వాజిద్ అలీ, అశోక్, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.

Read Also: ‘చంద్రబాబుతో నా బంధం ఇదే’.. రాహుల్ ను ప్రధాని చేస్తా: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>