ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లికి నిప్పుపెట్టి చంపిన కొడుకు

కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం (Prakasam) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కని.. పెంచిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి ఓ కసాయి కొడుకు చంపేశాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంటలో ఓ వ్యక్తి జన్మనిచ్చిన తల్లికి నిప్పుపెట్టి హత్య చేశాడు. తల్లి ఇంట్లో ఉండగానే నిప్పు అంటించి ప్రాణాలు బలిగొన్నాడు. మంటల ధాటికి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>