కలం , కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కుమారుడు కన్నతండ్రినే గొడ్డలితో నరికి చంపేశాడు. కాశ్మీర్‌గడ్డ (Kashmirgadda) ప్రాంతంలో జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి కాశ్మీర్‌గడ్డలో తన భార్యతో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతుల కుమారుడు నరసయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చి తల్లిపై దాడి చేశాడు. మల్లేష్ కొడుకును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరసయ్య తండ్రి మల్లేష్‌ను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు నరసయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Read Also: జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

