జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటూ పేర్కొన్నారు. 2034 వరకు తానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానంటూ దీమా వ్యక్తం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి .. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని రేవంత్ వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తాను జెడ్పీటీసీ స్థాయి నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించి ముఖ్యమంత్రి పదవికి చేరుకున్న విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. “జెడ్పీటీసీ సీఎం అవుతారా అని చాలామంది ఆశ్చర్యంగా చూశారు.. నేను అయి చూపించాను” అంటూ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో కూడా తన పాత్ర ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>