కలం, వెబ్ డెస్క్: ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా తరచుగా రైళ్లు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎండల తీవ్రతనో, అధికారుల నిర్లక్ష్యమో కానీ.. రైళ్లలో మంటలు చెలరేగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో (Konark Express) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Read Also: విజయవాడ దుర్గగుడిలో స్మార్ట్ సేవలు.. భక్తుల సౌకర్యానికి కొత్త దారి!
Follow Us On: Sharechat

