అత్తను కరెంటు షాక్‌తో చంపిన అల్లుడు

కలం, వెబ్ డెస్క్​ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గార్ల మండలంలోని సీతంపేట మంగళి తండాలో సోమవారం రాత్రి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అల్లుడే అత్తను కరెంటు షాక్ పెట్టి ప్రాణాలు తీసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడుకు చెందిన కౌసల్య (50) తన అల్లుడు రాజేష్ పిలుపు మేరకు సీతంపేటలోని అతని ఇంటికి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగా ఆమెకు కరెంటు షాక్ ఇచ్చి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అత్తమామలను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటం పలు అనుమానాలకు దారితీస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, రాజేష్‌పై కేసు నమోదు చేశారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>