Mobile Popup Ad
Mobile Popup Ad

నాలుగోసారి వరల్డ్‌కప్‌కు సన్ రెడీ.. కొరియా జట్టు ప్రకటింపు

కలం,వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా ఫుట్‌బాల్ స్టార్ సన్ హ్యూంగ్‌-మిన్ (Son Heung-min) మరో వరల్డ్‌కప్‌కు రెడీ అయ్యాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ (FIFA World Cup 2026) కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకుని నాలుగోసారి ఈ మెగా టోర్నీలో ఆడబోతున్నాడు. ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ సాకర్‌లో లాస్ ఏంజెల్స్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న సన్.. గత ఏడాది టోటెన్హామ్‌, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. జూలైలో 34 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నా.. ఇప్పటికీ కొరియా జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు.

కెప్టెన్ సన్‌తో పాటు పారిస్ సెయింట్ జర్మైన్ మిడ్‌ఫీల్డర్ లీ కాంగ్-ఇన్‌, బాయర్న్ మ్యూనిక్ డిఫెండర్ కిమ్ మిన్-జే, వూల్వ్స్ ఫార్వర్డ్ హ్వాంగ్ హీ-చాన్‌లకు కూడా జట్టులో స్థానం లభించింది. కోచ్ హాంగ్ మ్యుంగ్-బో ప్రకటించిన 26 మంది స్క్వాడ్‌లో బెసిక్టాస్ స్ట్రైకర్ ఓ హ్యోన్-గ్యూ, సెల్టిక్ ఆటగాడు యాంగ్ హ్యూన్-జున్, బర్మింగ్‌హామ్ మిడ్‌ఫీల్డర్ పైక్ సియుంగ్-హో కూడా చోటు సంపాదించారు. జర్మనీలో జన్మించిన జెన్స్ కాస్ట్రోప్ కూడా జట్టులో ఎంపికయ్యాడు.

ఈసారి దక్షిణ కొరియా గ్రూప్-ఏలో మెక్సికో, చెక్ రిపబ్లిక్, సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. తొలి రౌండ్ మ్యాచ్‌లన్నీ మెక్సికోలోనే జరగనున్నాయి. జూన్ 11న చెక్ రిపబ్లిక్‌తో కొరియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అనుభవజ్ఞులు, యూరప్ క్లబ్‌లో ఆడుతున్న ఆటగాళ్లతో కొరియా జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఈ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>