Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రులకు శాఖలను కేటాయించిన సీఎం విజయ్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర పరిపాలనలో భాగంగా టీవీకే పార్టీ చీఫ్, సీఎం విజయ్ (CM Vijay) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం 10 మంది మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సీఎం విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా N.ఆనంద్, మినిస్టర్ ఫర్ పబ్లిక్ వర్క్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌గా అధవ్ అర్జున్, వైద్యారోగ్య శాఖ మంత్రిగా K.G.అరున్ రాజ్, ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టాయన్, పౌర సరఫరాల శాఖ మంత్రిగా వెంకట్రామణన్, విద్యుత్ శాఖ, న్యాయ శాఖల మంత్రిగా నిర్మల్ కుమార్, విద్యా శాఖ మంత్రిగా రాజ్‌మోహన్, పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన, ఖనిజాలు, గనుల శాఖ మంత్రిగా టీ.కే. ప్రభులను నియమించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>