Mobile Popup Ad
Mobile Popup Ad

జ‌గ‌న్‌కు శ‌వ‌రాజ‌కీయాలంటే ఇష్టం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్‌కు విధ్వంసం, శవరాజకీయాలు అంటే ఇష్టమ‌ని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్సీ డిక్కీలో శ‌వం వేసుకొని వ‌స్తే జ‌గ‌న్‌ భుజం త‌ట్టార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నలో ఎవ‌రైనా చ‌నిపోతే క‌నీసం ప‌రామ‌ర్శ‌కు పోరు కానీ, వేరే పార్టీ నాయ‌కుల‌ను బూతులు తిట్ట‌డం, వారి త‌ల్లిదండ్రుల‌ను అవ‌మానప‌రిచే నాయ‌కుల ఇంటికి మాత్రం ప‌రామ‌ర్శ‌కు వెళ్తార‌న్నారు. ఇలా ఆయ‌న ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన‌ప్పుడు కూడా ఒక‌రో ఇద్ద‌రో చ‌నిపోవాల‌ని అనుకుంటార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో శ‌వ‌రాజ‌కీయాలు చేసే ఏకైక పార్టీ వైసీపీ అని చంద్ర‌మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>