Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిబ్ర‌వ‌రి 24న ఆర్టీసీ సంఘాల చ‌లో సెక్రటేరియట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంఘాలు (RTC Unions) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఫిబ్ర‌వ‌రి 24న చ‌లో సెక్ర‌టేరియ‌ట్‌ (Secretariat)కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల కోత పెడుతున్న‌ రూ.350 కోట్లును చెల్లించాలని సంఘాలు కోరుతున్నాయి. ఆయా సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇవ్వాల్సిన‌ పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రైవేటీక‌ర‌ణ‌ ఆపి, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>