మంత్రి లోకేశ్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్ :  మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati) ప్రశంసలు కురిపించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా లోకేశ్ పాదయాత్ర చేపట్టి పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకొచ్చారని అన్నారు. ఒంగోలు మహానాడు నిర్వహణతో పాటు పార్టీ కార్యక్రమాల సమన్వయంలో లోకేశ్ పాత్ర ఎంతో కీలకమని ఆయన  ప్రశంసించారు.

కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయడం, పార్టీ బలోపేతానికి కీలక సంస్కరణలు తీసుకురావడం వంటి చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోటి మంది సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని తెలిపారు. అలాగే విద్యా విధానంలో సంస్కరణల ద్వారా యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati) పేర్కొన్నారు.

Read Also: స్పృహ త‌ప్పిన‌ ఉద్యోగి.. ఫుట్‌ఫాత్‌పై ప‌డేసిన పీవీఆర్ యాజ‌మాన్యం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>