కలం, వెబ్ డెస్క్: పంజాగుట్ట పీవీఆర్ (Panjagutta PVR ) నెక్ట్స్ గలేరియా మాల్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ స్పృహ కోల్పోయిన ఉద్యోగిని యాజమాన్యం రోడ్డుపై పడేసింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మాల్‌లో హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఈరోజు విధులకు హాజరయ్యాడు. పని చేస్తున్నప్పుడే సత్యనారాయణ ఛాతీలో నొప్పిగా ఉందని, ఇంటికి వెళ్తానని యాజమాన్యాన్ని కోరాడు. అందుకు యాజమాన్యం నిరాకరించింది. సత్యనారాయణ విధుల్లో ఉండగానే వాంతులు చేసుకొని స్పృహ తప్పి పడిపోయినా కనికరం చూపించలేదు. కనీసం అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేయకుండా, అతడిని మాల్ లోపలి నుండి బయటకు తీసుకొచ్చి ఫుట్‌పాత్‌పై పడేశారు. ఏటా వందల కోట్ల డబ్బులు సంపాదించే పీవీఆర్ సంస్థ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక సాటి మనిషిని చెత్తలాగా పడేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాల్‌కు కొద్ది దూరంలోనే నిమ్స్ ఆసుపత్రి ఉన్నప్పటికీ, సత్యనారాయణను అక్కడికి తీసుకెళ్లకపోవడంపై అతడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. కనీసం ప్రభుత్వ ఆసుపత్రికైనా పంపించే బాధ్యత యాజమాన్యానికి లేదా అని ఆమె నిలదీసింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తన కొడుకు చిన్నవాడని, ఒక వేళ తన భర్తకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎలా ఉండేదని ప్రశ్నించింది. తాను కూడా పీవీఆర్ (Panjagutta PVR) ఫ్యామిలీలో ఒక మెంబర్ అని, ఎందుకు ఇంత అమానవీయంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ఆసుపత్రిలో చేర్పించి ఉంటే తామే వచ్చి బిల్లు కట్టుకునే వాళ్లమని చెప్పింది. కేవలం థర్డ్ పార్టీ ఉద్యోగి కావడడం లేదా తమ బిజినెస్‌కు ప్రాబ్లం అవుతుందనే భయంతోనే యాజమాన్యం ఇంత నీచంగా ప్రవర్తించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోయిడాలో గత కొన్ని రోజులుగా కార్మికులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో, ఇలాంటి దారుణమైన పరిస్థితులే దానికి అద్దం పడుతున్నాయి. కార్మికుల పట్ల యాజమాన్యాల ఈ బానిసత్వ ధోరణి, అమానవీయ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగి పట్ల PVR సంస్థ దారుణం.. గుండెనొప్పి వస్తే ఫుట్ పాత్ పై పడేశారు
హైదరాబాద్ పంజాగుట్ట లోని PVR Galleria మాల్ లో హౌస్‌కీపింగ్ సూపర్వైజర్ సత్యనారాయణ ఈరోజు ఉదయం ఛాతీ నొప్పి కారణంగా ఇంటికి వెళ్ళిపోడానికి మేనేజ్మెంట్ను పర్మిషన్ అడిగారు. అనుమతి ఇవ్వకపోవడంతో… pic.twitter.com/3y8svJ1BdK
— Kalam Daily (@kalamtelugu) April 16, 2026
Read Also: ‘జననాయగన్’ లీక్ కేసులో కీలక మలుపు!
Follow Us On: X(Twitter)

