కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా చేసిన ప్రయత్నం ప్రాణాంతకంగా మారి ఓ యువ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్‌కు చెందిన మొహిద్దీన్ (30) తన స్నేహితులతో కలిసి మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు (Moinabad Farmhouse) వెళ్లాడు. అక్కడ సరదాగా స్నేహితులను భయపెట్టాలని భావించిన అతను, అక్కడ కనిపించిన కట్లపామును చేత్తో పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా ఆ పాము అతడిని కాటు (Snake Bite) వేసింది.
పాము కాటుతో మొహిద్దీన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరదాగా చేసిన చిన్న తప్పిదం ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

