epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చిన్న నేరానికి పెద్ద శిక్ష.. కన్న కొడుకును బంధించిన తల్లిదండ్రులు!

కలం, వెబ్ డెస్క్: చిన్న నేరానికి పెద్ద శిక్ష వేశారు తల్లిదండ్రులు. దొంగగా మారిన తమ కుమారుడిని సరిదిద్దే ప్రయత్నంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ (Nagpur)లో తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఇనుప గొలుసులతో బంధించి తాళాలు వేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు ప్రతిరోజూ పనికి వెళ్లే ముందు ఆ బాలుడిని గొలుసులతో బంధించేవారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. శిశు సంక్షేమ అధికారులు ఆ ఇంటికి వెళ్లగా బాలుడు చేతులకు గొలుసులు, కాళ్లకు తాళం వేసి బంధించినట్లు గుర్తించారు. బాలుడి చేతులు, కాళ్లపై గాయాలున్నట్లు గమనించారు.

తల్లిదండ్రులు తమ కుమారుడి (Son)ని చదువు మాన్పించారు. ‘అల్లరి చేస్తాడు, మాట వినడు, ఫోన్లు దొంగిలించేవాడు’ అని తల్లిదండ్రులు ఆరోపించారు. రెండు నెలలు ఇదే తీరులో బంధిస్తూ ఉండడంతో ఆ బాలుడు మానసికంగా కుంగిపోయాడని అధికారులు వ్యాఖ్యానించారు. శారీరకంగానూ హింసకు గురైనట్లు తెలిపారు. తల్లిదండ్రులమీద జువెనైల్ జస్టిస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదైంది. బాలుడిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి పంపారు. ఈ ఘటన గురించి పోలీసులకు (Police) రెండుసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. పిల్లల పట్ల వేధింపులు, నిర్లక్ష్యానికి గురైతే వెంటనే పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>