కలం, వెబ్ డెస్క్: 2026 తొలి త్రైమాసిక అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్‌ను రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra), యువ అథ్లెట్ సచిన్ యాదవ్‌కు మాత్రమే చోటు దక్కింది. RTP అనేది వరల్డ్ అథ్లెటిక్స్‌లో అత్యున్నత యాంటీ డోపింగ్ పర్యవేక్షణ స్థాయి. ఇందులో ఉన్న అథ్లెట్లకు ముందస్తు సమాచారం లేకుండా కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉన్న అథ్లెట్లు తమ నివాస చిరునామాతో పాటు ప్రతి రోజూ పరీక్షలకు అందుబాటులో ఉండే 60 నిమిషాల సమయాన్ని ముందుగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించకపోతే తీవ్రమైన శిక్షలకు దారి తీసే అవకాశముంది.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా ఉన్న నీరజ్ చోప్రా (Neeraj Chopra)పేరు జాబితాలో ఉండటం సహజం. 26 ఏళ్ల సచిన్ యాదవ్‌కు ఈ అవకాశం దక్కడం అతడి కెరీర్‌లో కీలక మైలురాయిగా మారింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 86.27 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో సచిన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ జావెలిన్ విభాగంలో భారత భవిష్యత్తు ఆశగా ఎదుగుతున్నాడు. RTPలో అతడి చేరిక ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతడిపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం. ఈ జాబితా నీరజ్ కొనసాగిస్తున్న అగ్ర స్థాయిని మరోసారి చాటుతుండగా సచిన్ యాదవ్ కొత్త స్టార్‌గా ఎదుగుతున్న సంకేతాలను ఇస్తోంది.


