స్కిల్ ఉంటే కొలువు మీకే.. భారీగా వేతనాలు!

కలం, వెబ్ డెస్క్: స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్ష తక్కువ కాకుండా వేతనాలు అందించే కొలువులు (Job Opportunities) నిరుద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. యూరప్ సహా వివిధ దేశాల్లో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో, అవన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి వారికి అవకాశాలున్నాయో తెలుపుతూ .. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్ కామ్ వివరాలు వెల్లడించింది.

ఈ దేశాల్లో అవకాశాలు ఇలా..

* ఆస్ట్రేలియాలో ఐటీఐ వారికి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ అనుభవం ఉన్న ఫిట్టర్లు, వెల్డర్లకు నెలకు చెల్లించే వేతనం రూ.4 లక్షల పైమాటే.

* జర్మనీలో నర్సింగ్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇక్కడ నర్సింగ్ కోర్స్ చదివితే.. నెలకు స్టైఫండ్ రూ.లక్ష వరకు అందిస్తారు. ఉద్యోగంలో చేరితే రూ.2.5 లక్షల వరకు చేతికి అందుతుంది. సౌకర్యాలు, వసతులు అదనంగా కల్పిస్తారు.

* జపాన్ దేశంలో నిర్మాణ రంగంలో సివిల్, మెకానికల్ ఇంజినీర్ల కొలువులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అనుభవాన్ని బట్టి నెలకు వేతనం రూ.1.4 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది.

* ఇజ్రాయెల్, ఖతార్ దేశాల్లో ఏఎన్ఎం వంటి వైద్య సేవల సిబ్బందికి చాలా గిరాకీ ఉంది. ఇక్కడ నెల సాలరీ ప్రారంభం నుంచే రూ.1.2 లక్షలుగా ఉంటుంది.

* రష్యాలో ప్రింటింగ్ ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడ నెలకు రూ.50 వేల వేతనం అందిస్తున్నారు. పదో తరగతి పాసై, ప్రింటింగ్ ఆపరేటివ్ స్కిల్ ఉంటే చాలు. నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు.

* గ్రీస్ దేశంలో ఆతిథ్య రంగానికే ప్రాధాన్యం ఎక్కువ. హోటల్ మేనేజ్ మెంట్ రంగాల్లో పనిచేసే మహిళలకు నెలకు ప్రారంభ వేతనమే రూ.90 వేలుగా ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి ఉన్న వారు మొదట టామ్ కామ్ వెబ్ సైట్ https://tomcom.telangana.gov.inలోకి వెళ్లి రిజిస్టర్ కావాలి. విద్యార్హతతో సహా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు ఆయా కంపెనీలకు పంపిస్తుంటారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయితే.. అక్కడికి వెళ్లడానికి అవసరమైతే వీసా ఏర్పాటులో కూడా సాయం చేస్తుంటారు.

కంపెనీలతో నేరుగా ఒప్పందాలు..

ఇప్పటివరకు టామ్ కామ్ తరఫున విదేశాలకు తెలంగాణ నుంచి సుమారు 8 వేల మంది వరకు వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. తద్వారా, నియామక ప్రక్రియను మరింత సులభతరం అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>