కలం, వెబ్ డెస్క్: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’కి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. శుక్రవారం ఈ మూవీ రిలీజ్ అవగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.9.73 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.6.73 కోట్ల గ్రాస్, రూ.5.90కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఏకంగా రూ.3 కోట్లు వచ్చాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున (Nagarjuna).. తన కొడుకు అఖిల్, హీరో ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తోడు వచ్చాక అఖిల్‌కి గుడ్ టైం..
అఖిల్ లో సాధించాలనే తపన ఉందని.. చిన్ననాటి నుంచే ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేవాడని నాగ్ చెప్పుకొచ్చారు. డాక్టర్స్ కూడా అఖిల్ ని నేలపైనే పడుకోబెట్టమని చెప్పేవారని అన్నారు. కెరీర్ ఆరంభంలో సినిమాల కోసం చాలా కష్టపడ్డాడని.. అయినా ఆశించిన విజయం రాలేదని తెలిపారు. బయటకు ఏది తమతో చెప్పాడని.. గాయాలపాలైనా సైలెంట్ గా ఉండేవాడని అన్నారు. తనలో తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చారు. ఇంట్లోకి తన తోడు వచ్చాక అఖిల్ కి గుడ్ టైమ్ మొదలైందని.. అప్పటినుంచి అతడి ఆలోచన విధానం కూడా మారిందని ఈవెంట్ వేదికగా తెలిపారు. ఫైనల్లీ లెనిన్ (Lenin Movie) రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
తారక్‌కి థ్యాంక్స్
తాను ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లానని.. ఎప్పుడూ ఏమీ అడిగింది లేదని హీరో నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ సారి మాత్రం ‘మా వాడికి ఒక హిట్ ఇవ్వండి’ అని అడిగానని.. ముందుగా ఆయనికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఇక హీరో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘తర్వాత మా పెద్ద అబ్బాయి తారక్‌కి థ్యాంక్స్’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.

