కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా బాసర (Basara) మండల కేంద్రంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలు మరవకముందే తాజాగా మూగజీవాలపై దాడి (Dog Attack) చేశాయి. బాసర గ్రామానికి చెందిన ఉంగేరి అశోక్‌కు చెందిన ఆరు గొర్రె పిల్లలపై శుక్రవారం అర్ధరాత్రి పిచ్చికుక్కలు దాడి చేసి చంపినట్లు బాధితుడు వాపోయాడు. కుక్కల దాడితో గొర్రె పిల్లలను కోల్పోయి తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చిన్నారులపై దాడులు జరిగిన నేపథ్యంలో అధికారులు స్పందించి పిచ్చికుక్కల బెడదను అరికట్టాలని కోరాడు.

