మక్తల్ పట్టణ అభివృద్ధికి మంత్రి వాకిటి హామీ

కలం, మక్తల్ : నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని, పట్టణ అభివృద్ధి కోసం విరివిగా నిధులు మంజూరు చేసి అభివృద్ధిని వేగవంతం చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) హామీ ఇచ్చారు. మక్తల్ పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులను కేటాయించాలని విన్నవించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ గతంలో మక్తల్ పట్టణ అభివృద్ధిని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే అభివృద్ధిని పరుగులు పెట్టించానని చెప్పుకొచ్చారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతున్నదన్నారు. అలాగే పట్టణంలో అధిక సంఖ్యలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కోర్టు, ఫైర్ స్టేషన్, 150 పడకల ఆసుపత్రులను మంజూరు చేసి అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మరిన్ని నిధులను కేటాయించి పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సుందరీ కరణ పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిలర్లు రహీం పటేల్, పెయింటర్ వెంకటేష్, మహేష్, కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి, నీలప్ప, నీలా గౌడ్, శంకర్, మంజూర్ ఇలాహి తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>