Mobile Popup Ad
Mobile Popup Ad

‘సెయోన్’ గా శివకార్తికేయన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా

కలం, సినిమా : తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించి.. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఆ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘సెయోన్’ (Seyon) అనే పవర్ఫుల్ టైటిల్‌తో మేకర్స్ రిలీజ్ చేసిన శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ పోస్టర్, సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

కత్తి పట్టుకున్న శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఊర మాస్ లుక్.. ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అమరన్’ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో ‘సెయోన్’ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శివకార్తికేయన్ కెరీర్‌లో 26వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Read Also: బీజేపీ నేత వ్యాఖ్యలపై నటి త్రిష రియాక్షన్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>