ధాన్యాల నిల్వ గోదాంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : లక్ష్మణచందా మండల కేంద్రంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాంకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti ) బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గోదాములు ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతుల సంక్షేమంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత, మాజీ సర్పంచ్ ముత్యం రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>