కలం, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే అనేకమందిని విచారించిన సిట్ (SIT) బృందం తాజాగా మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)కి నోటీసులు జారీచేసింది. గురువారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. ఇదే కేసులో బుధవారం బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత ఆమె భర్త నర్సింహారెడ్డిలను సిట్ బృందం విచారించింది.
బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పారిజాత ఆమె భర్త నర్సింహారెడ్డిలను సీట్ అధికారులు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బిజెపి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌కు సైతం సిట్ నోటీసులు జారీచేసింది. ఆయనకు సిట్ అధికారులు ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపారు. రెండు మూడు రోజుల్లో లంకల దీపక్ సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

