కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నారాయణగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కాచెల్లెళ్లు భువనేశ్వరి(17), సంధ్య (10) తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఆదివారం రోజు ఇంటికి దగ్గరలోని మామిడి పండ్లను తిన్న ఇద్దరికి తరువాత రోజు నుంచి వాంతులు , విరోచనాలతో అవస్థలు పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఒకరు, మంగళవారం మరొకరు మృతి చెందారు. దీనికి ఫుడ్ పాయిజన్ కారణమా.. ఇతరేమైనా ఉన్నాయా.. అనేది తేలాల్సి ఉంది. కుటుంబసభ్యులు మాత్రం మామిడి పండ్లు తిన్నాకే ఇలా జరగిందని చెబుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: భవిష్యత్ తరానికి బంగారు బాటగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

