Mobile Popup Ad
Mobile Popup Ad

ధరల పెంపుపై సీపీఐ ఆగ్రహం.. కేంద్రంపై కూనంనేని ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో : కేంద్రంలోని NDA ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మద్దతుగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం (Kothagudem) ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తీవ్రస్థాయిలో విమర్శించారు. పెరిగిన ఇంధన, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై అదనపు భారాలు మోపడం అన్యాయమని కూనంనేని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదల జీవనాన్ని కష్టతరం చేస్తున్నారని విమర్శించారు. పాలకుల ఈ విధానాల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

దేశ సంపదను ధనవంతులకు ఊడిగం చేస్తూ దోచిపెడుతున్నారని, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కూనంనేని (MLA Kunamneni) మండిపడ్డారు. ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తక్షణమే పెరిగిన ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల పక్షాన ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: భవిష్యత్​ తరానికి బంగారు బాటగా ఫ్యూచర్​ సిటీ: సీఎం రేవంత్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>