epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘సర్’పైనే ప్రతిపక్షాల ప్రధాన గురి

కలం డెస్క్ : పార్లమెంటు(Parliament) శీతాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలన్నీ ‘సర్’ (Special Intensive Revision – SIR)పైనే దృష్టి పెట్టాయి. ఈ ప్రక్రియతో ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలన్నీ ఇప్పటికే ఫైర్ అయ్యాయి. డీఎంకే లాంటి కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో విపక్ష పార్టీలన్నీ ఆల్ పార్టీ మీటింగ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తి పార్లమెంటు వింటర్ సెషన్‌లో లోతుగా చర్చ జరగాలని పట్టుబట్టాయి. కాంగ్రెస్ ప్రతిపాదనతో అన్ని విపక్ష పార్టీలు దీనికి సమ్మతి తెలిపి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కేవలం ఇరవై రోజుల్లోనే సెషన్‌ను ముగిస్తున్నందున విపక్షాల డిమాండ్లను తుంగలో తొక్కే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, ప్రధానికి ఉన్నట్లు అనుమానాన్ని విపక్ష పార్టీల ప్రతినిధులు ఈ మీటింగ్‌లో వ్యాఖ్యానించాయి.

డిసెంబరు 1 నుంచి పార్లమెంటు(Parliament) ప్రారంభం కానుండడంతో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశంలో వింటర్ సెషన్‌లో ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుల జాబితాపై చర్చ జరిగింది. బిల్లుల సంగతి ఎలా ఉన్నా ‘సర్’ అంశంతో పాటు ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందించడం, దేశ అంతర్గత భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయడం, ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తదితర అంశాలపైనా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాల న్యాయమైన డిమాండ్లకు స్పీకర్ అనుమతించాల్సిందేనని, సభా కార్యకలాపాలకు విఘాతం కలిగితే దానికి కేంధ్ర ప్రభుత్వానిదే బాధ్యత అని నొక్కిచెప్పాయి. ఇదిలా ఉండగా కేంధ్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సెషన్‌లో సభ ముందుకు తీసుకురానున్నది. అందులో కొన్ని…

1. జన విశ్వాస్ (చట్ట సవరణ)
2. ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ కోడ్
3. మణిపూర్ జీఎస్టీ రెండో సవరణ
4. జాతీయ రహదారుల చట్ట సవరణ
5. అణు విద్యుత్
6. కార్పొరేట్ చట్టాల సవరణ
7. మార్కెట్ సెక్యూరిటీ కోడ్
8. ఇన్సూరెన్స్ చట్ట సవరణ
9. ఉన్నత విద్యా కమిషన్
10. సెంట్రల్ ఎక్సయిజ్ చట్ట సవరణ
11. హెల్త్ సెక్యూరిటీ-నేషనల్ సెక్యూరిటీ సెస్

Read Also: విజన్ డాక్యుమెంట్‌లో 8 అంశాలు రిలీజ్ ఎప్పుడంటే..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>