మరో రికార్డ్‌కి చేరువలో హిట్‌మ్యాన్

టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్(Rohit Sharma) మరో రికార్డ్ సాధించడానికి అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలవడనికి మూడే మూడు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. రాంచీలో ఆదివారం జరగనున్న భారత–దక్షిణాఫ్రికా మొదటి వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ ఖాతాలో 349 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ముందుండేది 351 సిక్స్‌లతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రమే. అంటే మరో రెండు సిక్స్‌లు కొడితే రోహిత్ అఫ్రిదితో సమానమవుతాడు. మూడు సిక్స్‌లు బాదితే అగ్రస్థానం రోహిత్‌దే!

ఆస్ట్రేలియా టూర్‌లో తన సూపర్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్(Rohit Sharma), అదే ఫామ్‌ను కొనసాగిస్తే ఈ రికార్డు రాంచీలోనే పుట్టే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బౌన్సర్లపై పుల్ షాట్లతో సులువుగా బౌండరీ బయటకు బంతిని పంపించే సామర్థ్యం రోహిత్‌కు ప్రత్యేకం. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తిగా వన్డే క్రికెట్‌పైనే దృష్టి సారిస్తున్నాడు. 2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలన్నదే అతని లక్ష్యం. అందుకోసం రోహిత్ తన ఫిట్‌నెస్, స్టామినాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బరువు తగ్గి మరింత ఫిట్‌గా మారిన సంగతి తెలిసిందే.

వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన వారు వీరే..
1. షాహిద్‌ అఫ్రిది (పాకిస్థాన్‌) – 351 సిక్స్‌లు
2. రోహిత్‌ శర్మ (భారత్‌)- 349* సిక్స్‌లు
3. క్రిస్‌గేల్‌ (వెస్టిండీస్‌)- 331 సిక్స్‌లు
4. సనత్‌ జయసూర్య (శ్రీలంక)- 270 సిక్స్‌లు
5. ఎంఎస్‌ ధోని (భారత్‌)- 229 సిక్స్‌లు

Read Also: ప్రస్తుతం టీమిండియాకు అలాంటి బ్యాటర్లు లేరు: కపిల్ దేవ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>