సింగరేణి సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాటిపై నిషేధం!

క‌లం, వెబ్‌డెస్క్‌: సింగరేణి (Singareni) కాలరీస్​ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి గనుల్లో ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. సంస్థ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా బొగ్గు గనులు ప్రమాదకర ప్రదేశాలు కావడంతో అనధికారిక ప్రవేశాలను కూడా నిషేధించింది. అలాగే ప‌ని చేసే చోట కార్మికుల వ్య‌క్తిగ‌త మొబైల్స్‌ను కూడా అనుమ‌తించ‌డం లేదు. అధికారిక అవ‌స‌రాల కోసం సంస్థ అనుమ‌తితో మాత్ర‌మే ఫోన్లు వాడ‌వ‌చ్చు. సింగ‌రేణిలో ఉండే ర‌హ‌స్య స‌మాచారం బ‌య‌ట‌కు లీక్ కాకుండా ఉండేందుకు సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>