సింగపూర్ పంపిస్తానని మోసం.. నిజామాబాద్‌లో ఏజెంట్‌పై కేసు

కలం, నిజామాబాద్ బ్యూరో : సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో ఓ వ్యక్తి అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నాడు. ఎడపల్లి (Yedapally)మండల కేంద్రానికి చెందిన గంగాధర్ అతని కొడుకు గోవర్ధన్‌ను ఉద్యోగం నిమిత్తం సింగపూర్‌కు పంపాలని అనుకున్నారు. మెంట్రాజ్ పల్లికి చెందిన పరిచయస్తుడు నారాయణా ద్వారా హైదరాబాద్‌లో శైలేష్ కుమార్ అనే ఏజెంట్‌ను స్ప్రదించారు.

సింగపూర్ ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు

మొదట ఏజెంట్‌ను కలిసి లక్ష రూపాయలు చెల్లించారు. తరవాత 3.90 లక్షలు విడిగా చెల్లించారు. డబ్బు తీసుకున్న ఏజెంట్ 2025 అక్టోబర్ 4 న సింగపూర్‌కు ఉద్యోగానికి కాకుండా విజిట్ పై మలేషియా తీసుకెళ్లి నెల పాటు కాలయాపన చేశాడు. ఆపై జాబ్ వీసా రావడం లేదని బుకాయించి డబ్బులు తిరిగి ఇస్తానని వెనక్కి తిరిగొచ్చారు. అప్పటినుంచి డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. దీంతో బాధితులు ఎడపల్లి పోలీసు స్టేషన్‌లొ ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు కేసు నమోదైంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>