కలం, వెబ్ డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిక్కిం (Sikkim) అతలాకుతలం అవుతోంది. వర్షం కారణంగా భారీ వరదలు సంభవించడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. వెస్ట్ సిక్కిం జిల్లాలోని యుక్సోమ్ – టాషిడింగ్ నియోజకవర్గం పరిధిలోని రిబి గ్రామలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిబ్బి గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో నివాస ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి.
కొండ పైనుంచి భారీగా రాళ్లు, మట్టి నివాస ప్రాంతాల వైపు దూసుకురావడంతో నష్టం ఏర్పడింది. కాగా, సిక్కిం (Sikkim) సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
🚨SHOCKING | Major landslide hits Rimbi Village in Sikkim after heavy rainfall causing significant damage pic.twitter.com/IKdL6sxE8K
— The Tatva (@thetatvaindia) September 25, 2026
Also Read: మిడ్ మానేరు రిజర్వాయర్‌కు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తివేత
Follow Us On: X(Twitter)

