ఈఎన్‌ గార్డెన్‌లో 29న ఉచిత కంటి వైద్య శిబిరం

కలం, కరీంనగర్‌: నగరంలోని మహర్‌నగర్‌లో గల ఈఎన్‌ గార్డెన్‌లో ఈనెల 29న ఉచిత కంటి వైద్య శిబిరం (Free Eye Medical Camp) నిర్వహించనున్నారు. గౌతమి ఫౌండేషన్‌, శంకర ఐ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శిబిరానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శుక్రవారం కరీంనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఆయన నివాసంలో గౌతమి ఫౌండేషన్‌ నిర్వాహకులు డా. గౌతమి ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్భంగా డా. గౌతమి మాట్లాడుతూ.. శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కంటి సమస్యలను గుర్తించి అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. అవసరం ఉన్న వారికి కళ్లద్దాలను కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడేలా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని (Free Eye Medical Camp) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కోరారు. అవసరమైన వారు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, యూసుఫ్‌ అలీ, జమ్ము, మాజీ అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ కర్ర సూర్యశేఖర్‌, పలువురు వైద్యులు, ఫౌండేషన్‌ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: మిడ్ మానేరు రిజర్వాయర్‌కు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తివేత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>