వైరాలో ఆర్టీసీ లగ్జరీ బస్సు మొరాయింపు

కలం, మధిర: హైదరాబాద్ నుంచి మధిర వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో వైరా (Wyra) పట్టణంలోని బస్టాండ్ వద్ద మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ​బస్సు ఎందుకు నిలిచిపోయిందో.. అధికారులు, సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. గంటల తరబడి బస్టాండ్‌లో పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేరొక ప్రత్యామ్నాయ బస్సును కేటాయించి తమను మధిరకు చేర్చాలని ప్రయాణికులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>