కొడంగ‌ల్‌లో రూ.9.053 కోట్ల అభివృద్ధి పనులు

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: కొడంగల్ (Kodangal) నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గ కావడంతో వేలకోట్ల రూపాయలతో ఆయన చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు–2 నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.2,100 కోట్లతో మక్తల్- నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. విద్యా రంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు శంకుస్థాపన, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ ఎ సి) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన ,రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.4.45 కోట్లతో తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి శంకుస్థాపన,రూ.5.10 కోట్లతో కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి శంకుస్థాపన,రూ.10 కోట్లతో లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో పర్యాటక హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన తదితర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>