కొత్తగూడెంలో ప్రైవేట్ చిట్టీల గుట్టు రట్టు

కలం, ఖమ్మం బ్యూరో: ​కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో ప్రైవేట్ చిట్టీల పేరుతో సాగిన భారీ మోసం (Chit Fund Fraud) బట్టబయలైంది. ప్రజల నుంచి రూ.55.33 లక్షలు వసూలు చేసి పరారయ్యేందుకు యత్నించిన ముగ్గురిని కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ​కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ గొల్లగూడేనికి చెందిన కట్టుల సరోజ, కట్టుల చంద్రకళ, కట్టుల కుమార్ కలిసి 11 చిట్టీలను నిర్వహించారు. ఖాతాదారుల నుంచి రూ.55,33,745 వసూలు చేసి.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడం లేదు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అన్నీ పరిశీలించాకే..

ఈ నేపథ్యంలో ముగ్గురు పారిపోయేందుకు యత్నిస్తుండగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చిట్టీల లావాదేవీల వివరాలు నమోదు చేసిన ఐదు బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ​

అధిక లాభాలు వస్తాయనే ఆశతో అనధికారిక ప్రైవేట్ చిట్టీలలో చేరి కష్టార్జితాన్ని కోల్పోవద్దని డీఎస్పీ సూచించారు. చిట్టీలలో చేరే ముందు నిర్వాహకుల చట్టబద్ధత, అనుమతులను పరిశీలించాలని, సరైన రసీదులు, రికార్డులు లేకుండా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. కేసు(Chit Fund Fraud)ను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.

Also Read : క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. తగ్గిన 137 ఔషధాల ధరలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>