కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) 11వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. వారం రోజుల పాటు సాగిన ట్రేడ్ విండో ముగియడంతో, ఈసారి బరిలోకి దిగుతున్న ఎనిమిది జట్ల (Squads) తుది వివరాలు ఖరారయ్యాయి. మార్చి 12న ప్రారంభమైన ఈ విండోలో జట్లు తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను మార్చుకున్నాయి.
ట్రేడ్ విండోలో మార్పులు
ఈ విండోలో ముల్తాన్ సుల్తాన్స్ అత్యంత యాక్టివ్‌గా కనిపించింది. క్వెట్టా గ్లాడియేటర్స్ నుండి అహ్మద్ డానియల్, జహాన్ జైబ్ సుల్తాన్‌లను ముల్తాన్ తీసుకుంది. బదులుగా ఫైసల్ అక్రమ్, అరాఫత్ మిన్హాస్‌లను క్వెట్టాకు పంపింది. అలాగే ఇస్లామాబాద్ యునైటెడ్ నుండి మహమ్మద్ వసీం జూనియర్‌ను దక్కించుకున్న ముల్తాన్, సల్మాన్ మీర్జా, నిసార్ అహ్మద్‌లను ఆ జట్టుకు ఇచ్చేసింది. ఆల్ రౌండర్ సాద్ మసూద్‌ను 5 లక్షల రూపాయలకు రావల్పిండిజ్ జట్టుకు ముల్తాన్ విక్రయించింది.
రీప్లేస్‌మెంట్స్
కేవలం మార్పిడిలే కాకుండా నేరుగా కొత్త ఆటగాళ్లను కూడా జట్లు ఒప్పందం చేసుకున్నాయి. ముల్తాన్ సుల్తాన్స్ ఇమ్రాన్ రంధావాను, పెషావర్ జల్మీ జట్టు ఫర్హాన్ యూసుఫ్, షోరిఫుల్ ఇస్లాంలను చేర్చుకుంది. గాయాల కారణంగా లాహోర్ ఖలందర్స్ షహాబ్ ఖాన్‌ను, రావల్పిండిజ్ జలత్ ఖాన్‌ను రీప్లేస్‌మెంట్‌లుగా ఎంపిక చేసుకున్నాయి.
ఫైనల్ స్క్వాడ్స్ ఇవే..
ఎనిమిది జట్ల పూర్తి స్క్వాడ్స్
1. లాహోర్ ఖలందర్స్: షహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, సికందర్ రజా, మహమ్మద్ నయీమ్, ముస్తాఫిజుర్ రెహమాన్, హారిస్ రవూఫ్, ఉసామా మీర్, ఫఖర్ జమాన్, ఉబైద్ షా, హసీబుల్లా, మహమ్మద్ ఫరూక్, దాసున్ షనక, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, ఆసిఫ్ అలీ, హుస్సేన్ తలత్, తయ్యబ్ తాహిర్, దునిత్ వెల్లలాగే, రూబిన్ హర్మన్, మాజ్ ఖాన్, షహాబ్ ఖాన్.
2. హైదరాబాద్ కింగ్స్‌మెన్: మార్నస్ లాబుషేన్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అకిఫ్ జావేద్, మాజ్ సదాకత్, సైమ్ అయూబ్, మహమ్మద్ అలీ, కుసాల్ పెరీరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, హసన్ ఖాన్, షాయన్ జహంగీర్, గ్లెన్ మాక్స్‌వెల్, హమ్మద్ అజం, రిలే మెరెడిత్, షర్జీల్ ఖాన్, ఆసిఫ్ మెహమూద్, హునైన్ షా, రిజ్వాన్ మెహమూద్, సాద్ అలీ, తయ్యబ్ ఆరిఫ్, అహ్మద్ హుస్సేన్.
3. ఇస్లామాబాద్ యునైటెడ్: షాదాబ్ ఖాన్ (కెప్టెన్), సల్మాన్ ఇర్షాద్, ఆండ్రీస్ గౌస్, డెవాన్ కాన్వే, ఫహీమ్ అష్రఫ్, మెహ్రాన్ ముమ్తాజ్, మాక్స్ బ్రియాంట్, మార్క్ చాప్‌మన్, నిసార్ అహ్మద్, మీర్ హమ్జా సజ్జాద్, సమీన్ గుల్, సమీర్ మిన్హాస్, ఇమాద్ వసీం, రిచర్డ్ గ్లీసన్, హైదర్ అలీ, మహమ్మద్ హస్నైన్, దిపేంద్ర సింగ్ ఐరీ, మహమ్మద్ ఫైక్, మహమ్మద్ సల్మాన్ మీర్జా.
4. కరాచీ కింగ్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), హసన్ అలీ, మహమ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, ఖుష్దిల్ షా, సాద్ బేగ్, మొయిన్ అలీ, ఆజం ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, షాహిద్ అజీజ్, మీర్ హమ్జా, ఆడమ్ జంపా, మహమ్మద్ హమ్జా సోహైల్, అకిబ్ ఇలియాస్, ఖ్వాజా బిన్ తన్వీర్, జాన్సన్ చార్లెస్, ముహమ్మద్ వసీం, ఇహ్సానుల్లా, రిజ్వానుల్లా.
5. క్వెట్టా గ్లాడియేటర్స్: సౌద్ షకీల్ (కెప్టెన్), ఉస్మాన్ తారిక్, హసన్ నవాజ్, షామిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, రిలీ రోసో, అహ్మద్ డానియల్, జహాన్ జైబ్ సుల్తాన్, జహందాద్ ఖాన్, ఖ్వాజా మహమ్మద్ నఫీ, వసీం అక్రమ్ జూనియర్, ఖాన్ జెబ్, బిస్మిల్లా ఖాన్, సాకిబ్ ఖాన్, బ్రెట్ హాంప్టన్, సామ్ హార్పర్, బెవాన్ జాకబ్స్, అబ్రార్ అహ్మద్, బెన్ మెక్‌డెర్మాట్, టామ్ కరణ్.
6. ముల్తాన్ సుల్తాన్స్: ఆష్టన్ టర్నర్ (కెప్టెన్), మహమ్మద్ నవాజ్, షెహజాద్ గుల్, ఫైసల్ అక్రమ్, ఇమ్రాన్ రంధావా, అరాఫత్ మిన్హాస్, సాహిబ్జాదా ఫర్హాన్, స్టీవ్ స్మిత్, పీటర్ సిడిల్, తబ్రైజ్ షమ్సీ, లాచ్లాన్ షా, డెలానో పాట్గీటర్, జోష్ ఫిలిప్, షాన్ మసూద్, మోమిన్ కమర్, ముహమ్మద్ అవైస్ జఫర్, ముహమ్మద్ షెహజాద్, అర్షద్ ఇక్బాల్, మహమ్మద్ వసీం జూనియర్, ముహమ్మద్ ఇస్మాయిల్, అతిజాజ్ హబీబ్ ఖాన్.
7. పెషావర్ జల్మీ: బాబర్ అజామ్ (కెప్టెన్), సుఫియాన్ ముకీమ్, అబ్దుల్ సమద్, అలీ రజా, ఆరోన్ హార్డీ, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్, మహమ్మద్ హారిస్, ఖలీద్ ఉస్మాన్, అబ్దుల్ సుభాన్, జేమ్స్ విన్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, కుసాల్ మెండిస్, ఇఫ్తిఖార్ అహ్మద్, నహిద్ రాణా, మీర్జా తాహిర్ బేగ్, కాషిఫ్ అలీ, షానవాజ్ దహానీ, ఫర్హాన్ యూసుఫ్, షోరిఫుల్ ఇస్లాం.
8. రావల్పిండిజ్: మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, జలత్ ఖాన్, యాసిర్ ఖాన్, నసీమ్ షా, రిషాద్ హుస్సేన్, డారిల్ మిచెల్, మహమ్మద్ అమీర్, అబ్దుల్లా ఫజల్, అమద్ భట్, డియాన్ ఫారెస్టర్, లారీ ఎవాన్స్, ఆసిఫ్ ఆఫ్రిది, కమ్రాన్ గులాం, ఫవాద్ అలీ, మహమ్మద్ అమీర్ ఖాన్, షాజైబ్ ఖాన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, సాద్ మసూద్.
Read Also: ఐపీఎల్ 2026లో కోహ్లీకి కొత్త ఛాలెంజ్..!
Follow Us On : WhatsApp

