Mobile Popup Ad
Mobile Popup Ad

రాజీవ్ రహదారిపై రైతుల ధర్నా: పంట కొనుగోలు చేయాలని డిమాండ్

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet Farmers) జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారిపై మెట్టుపల్లి, మాచపూర్ గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు. పొద్దుతిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మార్కెట్‌కు పంటను తీసుకొచ్చి నెల రోజులవుతున్నా అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల తాము నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>