గిల్‌ను ఔట్ చేయడం కష్టం: అశ్విన్

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)పై టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ ఈ సీజన్‌లో పరుగుల వేటలో టాప్‌లో నిలిచి, ‘ఆరెంజ్ క్యాప్’ గెలిచే అవకాశం ఉందని అశ్విన్ అంచనా వేశారు. ముఖ్యంగా టీ20 జట్టులోకి తిరిగి రావాలనే పట్టుదలతో ఉన్న గిల్, ఈసారి మరింత కసిగా ఆడతాడని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్ మైదానంలో గిల్‌ను అవుట్ చేయడం ప్రస్తుతం ఒక ‘డాన్’ను పట్టుకున్నంత కష్టమని అభివర్ణించారు. 2025 సీజన్‌లో 155.88 స్ట్రైక్ రేట్‌తో 650 పరుగులు చేసిన గిల్, 2026లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తాడని నమ్మకం వ్యక్తం చేశారు. పరుగులు సాధించడం గిల్‌కు ఒక హాబీ అని, అతను భారీగా పరుగులు చేయడం ద్వారానే తన ఉనికిని చాటుకుంటాడని అశ్విన్ తెలిపారు.

గిల్ (Shubman Gill) తన సహజ సిద్ధమైన ఆటను ఆడితే చాలని, అనవసరంగా స్ట్రైక్ రేట్ కోసం పాకులాడకూడదని అశ్విన్ సూచించారు. గిల్ దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని, కేవలం వేగంగా ఆడాలనే ఒత్తిడితో వికెట్ పారేసుకుంటే గుజరాత్ టైటాన్స్ కష్టాల్లో పడుతుందని హెచ్చరించారు. గిల్ ఒకవేళ నార్మల్ క్రికెట్ ఆడినా భారీ స్కోర్లు సాధించగల సామర్థ్యం అతనికి ఉందని ప్రశంసించారు. ప్రస్తుతం వన్డే, టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, గిల్ భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ 2026 ప్రదర్శన ద్వారా మళ్లీ టీ20 జట్టులోకి రావాలని అతను భావిస్తున్నట్లు అశ్విన్ చెప్పారు. గిల్, సుదర్శన్, బట్లర్‌లతో కూడిన టాప్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉందని, గిల్ మరోసారి పరుగుల వరద పారించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: నోట్ల రద్దు, కరోనా తర్వాత.. మరోసారి మోదీ కీలక స్టెప్..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>