కలం, వలిగొండ: వచ్చే ఎన్నికల్లో ఒక్క రెడ్డిని కూడా అసెంబ్లీకి వెళ్లనివ్వబోమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అన్నారు. శనివారం సాయంత్రం వలిగొండ మండల కేంద్రానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాదయాత్ర చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నరకాసురుడి కంటే దారుణంగా ఉందని అన్నారు.
భువనగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కోనపురి సాంబశివుడు, బెల్లి లలితక్కను పొట్టన పెట్టుకుంది రెడ్డిలే అని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఆరోపణలు గుప్పించారు. భువనగిరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీసీలు రెడ్ల, వెలమ ఓట్లను అడగరన్నారు. దమ్ముంటే రెడ్లు కూడా మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పాలన్నారు. నాయకులు బొలుగుల నరసింహ, పిట్టల శంకర్, సునీత, ప్రసన్న, లలిత, రమేష్, పుష్ప, సుశీల, ఉషా కీర్తి, పూజిత తదితరులు పాల్గొన్నారు.
Also Read : పుల్లారెడ్డి స్వీట్స్‌కు దెబ్బ మీద దెబ్బ!
Follow Us On: X(Twitter)

