Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండియా వన్డే టీమ్ కెప్టెన్‌గా గిల్

కలం, వెబ్ డెస్క్ : టీమిండియా వన్డే సిరీస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill)ను బీసీసీఐ ప్రకటించింది. అప్ఘాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో జట్టుకు గిల్ సారథ్యం వహించనున్నాడు. ఈ వన్డే జట్టులోకి సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చినప్పటికీ, వారు ఆడటం అనేది ఫిట్‌నెస్ పరీక్షలపైనే ఆధారపడి ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. మంగళవారం గౌహతిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వైట్ బాల్ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు జట్టులో ఉన్నారు. అలాగే ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి కొత్త ముఖాలకు కూడా 15 మంది సభ్యుల వన్డే జట్టులో చోటు దక్కింది. జూన్ 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా ఈ వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>