కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అప్రమత్తత ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు తీవ్ర వడగాలులు ఉండే అవకాశం ఉందని.. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లవద్దని సూచించింది. అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేఏసింది. బస్టాండ్లు, మార్కెట్ క్యాంటీన్లలో కచ్చితంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి, చల్లటి తాగునీరు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తీర ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు..
తీర ప్రాంత జిల్లాల్లో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్మికులు, కూలీలు, వీధి వ్యాపారులు, వృద్ధుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పురపాలక శాఖ సూచించింది. అత్యవసర సేవలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

