కలం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కలేదు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే అర్ష్‌దీప్‌ను పక్కనబెట్టడంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) క్లారిటీ ఇచ్చాడు. ప్లాన్ ప్రకారమే అర్ష్‌దీప్‌ను పక్కనబెట్టామని చెప్పాడు. మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అర్ష్‌దీప్ (Arshdeep Singh)కు విశ్రాంతి ఇచ్చామని స్పష్టంగా చెప్పాడు. ఇది పూర్తిగా ఆటగాళ్ల రొటేషన్ విధానంలో భాగమేనని వెల్లడించాడు. ఇందులో ఎలాంటి వివాదం లేదని గిల్ తేల్చి చెప్పాడు. వన్డే మ్యాచ్‌లు ఎక్కువగా లేకపోవడంతో అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాడు.
తొలి వన్డేలో తన బ్యాటింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన గిల్.. విరాట్ కోహ్లీ ఫామ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కఠినమైన పిచ్‌లపై కూడా కోహ్లీ బ్యాటింగ్ చాలా సులువుగా కనిపిస్తుందని చెప్పాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు జట్టుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. మొత్తానికి అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడం వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని, జట్టు అవసరాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ స్పష్టంచేశాడు.


